ఎన్టీఆర్ కోసం హను వెయిట్ చేస్తాడా..
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమై...కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో సక్సెస్ సాధించిన యువ దర్శకుడు హను రాఘవపూడి. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సక్సెస్ తర్వాత హను ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ - హను సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు.
తాజా సమాచారం ప్రకారం...ఎన్టీఆర్ కి హను చెప్పిన కథ నచ్చిందట. కాకపోతే జనతా గ్యారేజ్ తర్వాత వక్కంతం వంశీ తో సినిమా చేయాలి ఈ సినిమా తర్వాత చేద్దాం అన్నాడట. జనతా గ్యారేజ్ ఆగష్టు లో రిలీజ్. ఆతర్వాత వక్కంతం వంశీతో సినిమా, పూరి జగన్నాథ్ ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత అంటే 2017 ద్వితీయార్ధం లో హను సినిమా ఉండొచ్చు. అందాల రాక్షసి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హను..ఇక నుంచి గ్యాప్ తీసుకోను అన్నారు. మరి గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తాడో..? లేక గ్యాప్ లేకుండా ఈలోపు మరో సినిమా చేస్తాడో..? చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com