మంచి మ‌న‌సు చాటుకున్న తార‌క్‌

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

కోవిడ్ 19 కారణంగా పేద ప్ర‌జ‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తివారు చాలా క‌ష్టాల ప‌డుతున్నారు. సెల‌బ్రిటీలు చాలా మంది వారికి త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తార‌క్ త‌న ఆఫీసులో ప‌నిచేస్తోన్న సిబ్బందికి ముందుగానే జీతాల‌ను చెల్లించార‌ట‌. ఇలాంటి క్రిటిక‌ల్ సిట్యువేష‌న్‌లో ముందుగానే సిబ్బందికి జీతాల‌ను తార‌క్ అందించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అంతే కాకుండా ఏదైనా ఆర్థిక సాయం కావాల‌న్నా అడ‌గ‌మ‌ని త‌న సిబ్బందికి చెప్పార‌ని టాక్‌. ఇప్ప‌టికే క‌రోనా నివార‌ణ‌పై పోరుకు 75 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌భుత్వాల‌కు అందించిన తార‌క్ ఇందులో పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సినీ కార్మికుల కోసం కేటాయించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం తార‌క్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్‌తో క‌లిసి ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్‌)’సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను పూర్తి చేస్తారు. దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రంలో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు వ‌చ్చే ఏడాదిలో విడుద‌ల‌వుతాయి.

More News

మెగాస్టార్ మ‌ల్టీస్టార‌ర్.. మ‌రో హీరో ఎవ‌రంటే?

రీ ఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ వ‌రుస సినిమాల‌తో స్పీడు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ట్రాక్‌ పై నిద్రిస్తున్న 17 మంది మృతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వగ్రామాలకు బయల్దేరిన రైల్వే కూలీలు ట్రాక్‌పై నిద్రిస్తుండగా వారిపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది.

మ‌రో తెలుగులో సినిమాలో విల‌న్‌గా అర‌వింద‌స్వామి..?

అర‌వింద‌స్వామి.. 1980-90 సినిమాల్లో హీరోగా న‌టించి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయారు. అయితే సినిమా రంగం నుండి ఆయ‌న ఉన్న‌ట్లుండి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు.

'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా, శ్రీదేవి హీరోయిన్‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’. ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం విడుద‌లై

మెగా ఫ్యాన్స్ కోరిక నేర‌వేరేనా?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు రెండు పెద్ద కోరిక‌లు మిగిలిపోయాయి. అవేంటంటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించ‌డం, మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ