భార్య పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఎన్టీఆర్

  • IndiaGlitz, [Monday,March 22 2021]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయనిచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ నెల 18న లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడనేది అభిమానులకు చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్టు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సిటీలో ఓ పెద్ద ఫామ్ హౌస్‌ను తారక్ కొని దానిని తన భార్య పేరిట రాయించాడట. అంతే కాదు.. లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుకను సైతం ఎన్టీఆర్ ఆ ఫామ్ హౌస్‌లోనే నిర్వహించినట్టు టాలీవుడ్‌లో బలంగా టాక్ వినిపిస్తోంది.

భర్త ఇచ్చిన కానుకకు ప్రణతి బాగా ఖుషీ అయినట్టు సమాచారం. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ 2011 మే 5న ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు 2014లో అభయ్‌ రామ్‌కు, 2018లో భార్గవ్‌ రామ్‌కు జన్మనిచ్చారు. కాగా.. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఫిక్షన్ కథాంశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

జాతీయ అవార్డులను గెలుచుకున్న ‘జెర్సీ’, ‘మహర్షి’

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది.

ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'ఇక్షు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన అల్లరి నరేష్

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా ఋషిక దర్శకత్వంలో

స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ విజేత యశస్వి కొండేపూడి .... రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రోఫీ

ఆట ఎప్పుడు మొదలైనా గెలుపు ఎవరిది?? విజేత ఎవరు?? అని ఎదురుచూస్తుంటాం. 30 వారాల సుదీర్ఘ ప్రయాణం తరువాత యశస్వి కొండేపూడి, స రి గ మ ప

30 శాతం పీఆర్సీ ప్రకటన.. కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.