శివకు గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

దర్శకుడు కొరటాల శివ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ బాగా నడుస్తుంది. తొలి సినిమా మిర్చితో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తర్వాత మహేష్ శ్రీమంతుడుతో బాహుబలి తర్వాత నెక్ట్స్ రేంజ్ సక్సెస్ ను అందుకున్నాడు. శ్రీమంతుడు సక్సెస్ తో హ్యపీ ఫీలైన మహేష్ కొరటాల శివకు ఏకంగా 50 లక్షల కారును గిఫ్ట్ గా ప్రెజెంట్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ మూవీ ప్రారంభం అయ్యింది. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఎన్టీఆర్, కొరటాల శివ వర్కింగ్ స్టయిల్ నచ్చి ఏకంగా 20 లక్షల వాచీని గిఫ్ట్ గా ఇచ్చాడని, హీరోలను బుట్టలో వేసుకోవడంలో కొరటాల శివ ముందున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.