చరణ్ కోసం యంగ్ టైగర్
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వినయవిధేయ రామ'. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ లేదా ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించబోతున్నారు.
ఈ వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడని సమాచారం. ఇంతకు ముందు మహేశ్‌బాబు 'భరత్ అనే నేను' చిత్ర ప్రీ రిలీజ్ పంక్షన్‌కి కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడట.
రామచరణ్‌తో ఎన్టీఆర్‌కు ఉన్న స్నేహం.. ఇప్పుడు ఇద్దరూ కలిసి రాజమౌళి సినిమా చేస్తుండటం వంటి కారణాలతో ఎన్టీఆర్ 'వినయవిధేయరామ' కి ముఖ్య అతిథిగా వస్తున్నాడనేది సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments