'జై సింహా' ప్రీమియర్ షోకి ఎన్టీఆర్?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జై సింహా`. కన్నడ నటి హరిప్రియ, మలయాళీ బ్యూటీ నటాషా దోషితో పాటు ప్రకాష్ రాజ్, అశుతోష్ రానా, బ్రహ్మానందం, మురళీమోహన్, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. గౌతమిపుత్ర శాతకర్ణి ఫేమ్ చిరంతన్ భట్ సంగీతమందించారు. కాగా, ఇప్పటికే విడుదలైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్స్ ఈ మూవీపై మంచి హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే...సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ప్రీమియర్ షోని జనవరి 11న ప్రదర్శించనున్నారు. ప్రీమియర్ షోకి సంబంధించి ఇప్పటికే నారా కుటుంబాన్ని ఆహ్వానించినట్లు సమాచారం. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి కూడా ఆహ్వాన పత్రిక పంపినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments