ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్రం కన్నడంలో...
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా హిట్ చిత్రాలు మాత్రమే వేరే భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. కానీ విచిత్రంగా ఓ ప్లాప్ సినిమాను రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. వివరాల్లోకెళ్తే...ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో హరీష్ దర్శకత్వంలో విడుదలైన రామయ్యా వస్తావయ్యా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిలయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్న ఓ కన్నడ స్టార్ రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. సినిమా ఫస్టాఫ్ బానే ఉందని, సెకండాఫ్ లో మార్పులు చేర్పులు చేసి మంచి కథను సిద్ధం చేయాలని అక్కడి రచయితలకు సూచించాడట. ప్రస్తుతం వారు ఈ రీమేక్ కోసం సెకండాఫ్ ను చేంజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments