ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న సెంటిమెంట్..

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

మ‌న‌లో చాలా మంది సెంటిమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే ఇండ‌స్ట్రీలో అయితే ఇంపార్టెన్స్ మ‌రి కాస్త ఎక్కువుగా ఉంటుంది. ఇప్పుడు ఓ సెంటిమెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాగా భ‌య‌పెడుతుంది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏమిటంటే....ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. బ‌న్ని పుట్టిన‌రోజు నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అయ్యింది. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక డిజాస్ట‌ర్ గా నిలిచింది. మే 20 ఎన్టీఆర్ పుట్టిన‌రోజు.
ఎన్టీఆర్ పుట్టిన‌రోజు నాడు రిలీజైన మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం కూడా ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఒక హీరో పుట్టిన‌రోజు నాడు వేరే హీరో సినిమా రిలీజైతే డిజాస్ట‌ర్ అవుతుంది. ఇలా జ‌రుగుతుండ‌డం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని భ‌య‌పెడుతుంది ఎందుకంటే...జ‌న‌తా గ్యారేజ్ సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ అని ప్ర‌క‌టించారు. అయితే సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు. మ‌రి..ప‌వ‌న్ పుట్టిన‌రోజు నాడు రానున్న ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో..? లేక‌ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తుందో చూడాలి.