పిచ్చి ప్రేమ అంటే ఏమిటో చూపిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

త‌మ అభిమాన హీరో మీద ఒక్కొక్క‌రు ఒక్కొళా త‌మ అభిమానాన్ని చూపిస్తుంటారు. కొంత మంది అయితే...త‌మ హీరోను ఎంత‌గా అభిమానిస్తున్నామో చూపించేందుకు కొత్త‌గా ఏదొటి చేస్తుంటారు. ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం సెప్టెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని కాదు కాదు పిచ్చి ప్రేమ‌ను తెలియ‌చేసేలా ఓ అభిమాని చాతి పై ఎన్టీఆర్ రూపంను ప‌చ్చ‌బొట్టుగా వేసుకుంటే...మ‌రో అభిమాని జ‌న‌తా గ్యారేజ్ అనే టైటిల్ ను త‌న ముఖం పై ప‌చ్చ బొట్టు వేయించుకున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప‌చ్చబొట్టు వేసుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాలం మారుతున్నా..హీరోల పై చూపించే అభిమానం మాత్రం మార‌డం లేదు..! ఏమిటో ఈ పిచ్చి ప్రేమ‌...!