NTR:ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్'లో చోటు
Send us your feedback to audioarticles@vaarta.com
RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్'లో సభ్యత్వం పొందారు. 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో తారక్ స్థానం సంపాదించారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్‌తో పాటు కే. హుయ్ క్వాన్, కెర్రీ కాండన్, రోసా సలాజర్, మార్షా స్టెఫానీ బ్లేక్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఆస్కార్ అకాడమీ తన కొత్త మెంబర్స్ యాక్టర్స్ లిస్ట్‌ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఏడాది సభ్యులుగా చేరిన ఐదుగురు నటుల పేర్లను వెల్లడించింది.
తారక్‌పై సినీ ప్రముఖుల ప్రశంసలు..
భారత్ నుంచి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తారక్‌పై తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇతర సినీ పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే దసరా పండుగ ముందే చేసుకుంటున్నారు. RRR సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో తారక్ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఇక 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాతో తారక్, చెర్రీ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు.
ఏప్రిల్ 5న విడుదల కానున్న 'దేవర' పార్ట్-1..
ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తారక్‌కు జోడీగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దేవర పార్ట్-1' వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్‌లోనూ తారక్ నటిస్తున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్-2' చిత్రంలో నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments