ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

  • IndiaGlitz, [Tuesday,October 22 2019]

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం 'RRR' . యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఈ భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ సినిమా రూపొందుతుంది. కాగాఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ వీరుడు కొమురంభీమ్‌గా న‌టిస్తుంటే.. చ‌ర‌ణ్ ఆంధ్ర మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నారు. కాగా మంగ‌ళ‌వారం కొమురం భీమ్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా 'RRR' యూనిట్ ఎన్టీఆర్ లుక్‌ని విడుద‌ల చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ యూనిట్ మాత్రం ఓ ట్వీట్‌ను మాత్ర‌మే చేసింది.

''తెలంగాణ‌కు చెందిన గొప్ప పోరాట యోధుడు కొమురం భీమ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న్ని గుర్తు చేసుకుంటున్నాం. మా 'RRR' లో కొమురం భీమ్‌గా న‌టిస్తున్న తార‌క్‌ను వెండితెర‌పై  చూపించ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం'' అంటూ మెసేజ్ చేశారు.

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్, కోలీవుడు న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. రామ‌రాజు జోడి సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎమ్మారాబ‌ర్ట్స్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇద్ద‌రు విప్ల‌వ నాయ‌కుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. 'బాహుబ‌లి' త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావ‌డంతో అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

హుజుర్‌నగర్‌లో భారీగా పోలింగ్.. గెలుపెవరిదో తేల్చిసిన సర్వే!

తెలంగాణలోని హుజుర్‌నగర్‌లో సోమవారం నాడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

బెల్లంకొండ గణేష్ స‌ర‌స‌న ఓ జోడిగా!

ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో త‌న‌యుడు బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

'మా' మీటింగ్ గురించి జీవిత వివ‌ర‌ణ‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించిన జ‌న‌ర‌ల్ మీటింగ్ ఆదివారం జ‌రిగింది. న‌రేష్ వ‌ర్గం, జీవిత‌-రాజ‌శేఖ‌ర్‌కి వ‌ర్గాలుగా అంద‌రూ విడిపోయార‌ని వార్త‌లు వినిపించాయి

మోదీజీ.. మమ్మల్నీ గుర్తించండి : ఖుష్బూ

ప్రధాని నరేంద్ర మోదీ కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ తారలకు తన నివాసంలో ఇచ్చిన ఆతిథ్యంతో ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రచ్చ అవుతోంది.

నాలుగు డిఫరెంట్ లుక్స్ లో కీర్తి

సాధార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది న‌టీన‌టులు వ‌చ్చి పో&