మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్ గుర్రు.. తారక్‌కు ట్వీట్ పెట్టిన హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ అభిమానులకు హీరోయిన్ మీరా చోప్రాపై కోపం వచ్చింది. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ట్రెండ్‌లో అభిమానులు ఊరుకుంటారా? ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అసలేం జరిగిందనే వివరాల్లోకెళ్తే.. మీరా చోప్రా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ తెలుగులో తనకు మహేశ్ ఫేవరెట్ హీరో అని చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గురించి తారక్ అభిమానులు ప్రశ్నించగా ఆయన గురించి తనకు తెలియదని, తను తారక్ ఫ్యాన్ కాదు అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారింది. తమ హీరో గురించి తెలియదని చెప్పడంతో అభిమానులు గుస్సా అయ్యారు. మీరా చోప్రాను ట్రోల్ చేయడమే కాకుండా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
అయితే మీరా చోప్రా ఊరకనే ఉండలేదు. తారక్ అభిమానులను చేస్తున్న విషయాలపై ఏకంగా ఎన్టీఆర్‌కు ట్వీట్ పెట్టింది. ‘‘మీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్‌స్టార్ అంటున్నారు. నా తల్లిదండ్రులను కించపరచడమే కాకుండా అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇలాంటి అభిమానులను సంపాదించుకుని మీరు సక్సెస్ అయ్యారని భావిస్తున్నారా? మీరు నా ట్వీట్‌ను పట్టించుకోకుండా ఉండరని భావిస్తున్నాను’’ అన్నారు.
అంతే కాకుండా అమ్మాయిలు.. ‘‘మీరు తారక్ అభిమానులు కాకపోతే మిమ్మల్ని రేప్ చేస్తారు, చంపేస్తారు, గ్యాంగ్ రేప్ చేస్తారు. హీరో పేరును ఇలాంటి అభిమానులు నాశనం చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. చిన్మయిలాంటి వ్యక్తులు మీరా చోప్రాకు అండగా నిలబడుతున్నారు.
@hydcitypolice @CyberCrimeshyd i would like to report all these accounts. They are talking abt gang banging, are abusive and death threatning. Unfortunately they are all @tarak9999 fanclubs. @Twitter i would request you to look into it and suspend these accounts. pic.twitter.com/7bBEz2fZHh
— meera chopra (@MeerraChopra) June 2, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments