తూచ్.. #RRR ఎన్టీఆర్ లుక్ అంతా ఫేక్!

  • IndiaGlitz, [Sunday,July 07 2019]

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం #RRR. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా #RRR ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన టైమింగ్ ఏదో గానీ అన్నీ అడ్డంకులే ఎదరవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, చెర్రీ ఇద్దరూ గాయాలపాలైన విషయం విదితమే.

అయితే తాజాగా.. ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్ రివీల్ అయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓ ఫొటో వైరల్ అయిన విషయం విదితమే. ఈ పిక్‌లో కోర మీసం, కొద్దిగా పెరిగిన గడ్డం, తలకు ఎర్రని పాగా ధరించి ఎన్టీఆర్ ఏదో చూస్తున్నట్లుగా ఉంది. ఈ లుక్‌ ఎన్టీఆర్ ఒరిజినల్ లుక్ అని భ్రమింపజేసేలా ఉందని పెద్ద ఎత్తున కామెంట్స్ అభిమానులు, సినీ ప్రియులు కామెంట్ చేశారు. అయితే ఇది నిజంగానే లీక్ అయ్యిందా..? లేకుంటే ఎవరైనా కావాల్సిందే ఈ ఫొటోను లీక్ చేశారా..? లేదా ఫ్యాన్స్ ఎవరైనా ఇలా చేశారా..? అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.

మరోవైపు.. ఈ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఇంత వరకూ #RRR చిత్రబృందం రియాక్ట్ అవ్వలేదు. అయితే ఈ లుక్‌ను కాస్త నిశితంగా పరిశీలించగా.. ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తేలిపోయింది. ఇదిలా ఉంటే చిత్రబృందం సైతం ఇదంతా తూచ్.. ఫేక్ లుక్ అని స్పందించలేదని సమాచారం. కాగా.. అభిమాన హీరో సినిమా వస్తోందంటే చాలు కొత్త కొత్త టైటిల్స్.. కొత్త కొత్త లుక్స్‌తో ఇలా ఫ్యాన్స్ హడావుడి చేస్తుంటారు. ఇందులో భాగంగానే చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఓ ఫ్యాన్ ఇలా ఫొటో షాప్‌లో న్యూ లుక్ అంటూ వైరల్ చేశారని తేలింది.

More News

వాషింగ్టన్‌లో జనసేన-బీజేపీ.. మధ్యలో చిరంజీవి.. ఏం జరుగుతోంది!

అమెరికాలో తెలుగు ప్రజలంతా కోలాహలంగా జరుపుకుంటున్న తానా మహా సభల్లో ఆసక్తికర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ సభలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్..

అమ‌లాపాల్‌ను లిప్ లాక్ చేసిన అమ్మాయి

డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్‌ను పెళ్లి చేసుకుని, మూడేళ్లు తిర‌గ‌క‌ముందే విడాకులు తీసుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది.

కేంద్ర బడ్జెట్‌పై జనసేన రియాక్షన్ ఇదీ...

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు.

అమ్మ సినిమాలే నాకు రిఫరెన్స్.. నో డైలాగ్స్ : శివాత్మిక

ఆనంద్ దేవరకొండ, శివాత్మక నటీనటులుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్‌బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’.

ఈ గుండె ధైర్యం వాళ్లు ఇచ్చినదే.. : పవన్

'అమెరికాలో ఎన్ని ఆర్గ‌నైజేష‌న్లు ఉన్నా మ‌నంద‌రం క‌లసిక‌ట్టుగా ఉండాలి. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు మ‌న‌మే స‌హాయం చేసుకోవాలి త‌ప్ప బ‌య‌ట‌వాడు చేయ‌డు' అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.