తార‌క్ అన్నీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతాడు..!

‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు ప్ర‌త్యేక కార‌ణాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘బాహుబ‌లి’ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. అలాగే బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ స‌హా హాలీవుడ్ తార‌లు రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఉగాదికి విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్స్ క్రియేట్ చేసిన బ‌జ్ త‌గ్గ‌క ముందే రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ ఎలా ఉండ‌బోతున్నాడ‌నే వీడియోను కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తోన్న తార‌క్ విడుద‌ల చేయ‌డం విశేషం. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. అన్నీ వెర్ష‌న్స్‌లో డైలాగ్స్‌ను తార‌క్ చెప్ప‌డం విశేషం. మ‌రి సినిమా పూర్త‌యిన త‌ర్వాత అన్నీ భాష‌ల్లో పూర్తి డ‌బ్బింగ్‌ను తార‌క్ చెప్పేలాగానే ఉన్నాడ‌నిపిస్తుంది. జ‌క్క‌న్న ఇద్ద‌రి పాత్ర‌ల‌ను అద్భుతంగా మ‌లుస్తున్నాడని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

More News

ఇండియాలో ఫస్ట్ టైమ్ కోవిడ్-19 మైక్రోస్కోపీ చిత్రం

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో రోజురోజుకూ కరోనా

లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం.. ఇళ్లలో నుంచి బయటికి రాకండి : కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఏప్రిల్-15 వరకు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన..

అదంతా ఫేక్.. ఈ ఫుడ్ తింటే కరోనా ఖతం: కేసీఆర్

కరోనా వైరస్ భయంతో ప్రజలు అందరూ అల్లాడుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన

బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కూడా కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చిందనే షాకింగ్ విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త విన్న కొన్ని గంటల వ్యవధిలేనే మరో ఊహించని విషయం వెలుగుచూసింది.

షాకింగ్: బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్!

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా