Devara:'దేవర' గ్లింప్స్ వచ్చేసిందిగా.. ఎన్టీఆర్ నటన అరాచకం అంతే..

  • IndiaGlitz, [Monday,January 08 2024]

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'. ఇప్పటికే విడుదలైన పోసర్లు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయగా.. తాజాగా మూవీ యూనిట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇంగ్లీష్ లిరిక్స్‌తో ప్రారంభమైన గ్లింప్స్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ముగుస్తుంది. సముద్రంలో స్మగ్లింగ్ చేయడం వంటి సన్నివేశాలను ఇందులో చూపించారు. చివర్లో “ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు” అంటూ తారక్ చెప్పై డైలాగ్ సూపర్బ్‌గా ఉంది. ఇక అనిరుథ్ అందించిన బీజీఎం అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో 'దేవర' సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గతంలో ఎప్పుడు లేనంత భయంకరంగా ఉంటారని చెప్పారు. అంతేకాకుండా సినిమాలో విపరీతమైన వయెలెన్స్ ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా కథకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నామని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తుండడం విశేషం. కాగా ఎన్టీఆర్- కొరటాల కలయికలో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో నటుడిగా తారక్ మరో మెట్టు ఎక్కారు. వీరి కాంబోలో ఇప్పుడు 'దేవర' రానుండడంతో మూవీ సర్కిల్లో హై భజ్ ఏర్పడింది. మొదటి పార్ట్‌ ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.