ఎన్టీఆర్ అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించనున్న చిత్రం 'ఆన్ సైలెంట్ మోడ్' (ప్రచారంలో ఉన్న పేరు). ఈ సినిమాకి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇంతకుముందు 'బృందావనం' చిత్రం కోసం ఏ విధంగానైతే స్టైల్‌గా కనిపిస్తూనే ఫిట్‌గా కనిపించారో.. అదే విధమైన లుక్స్ ఉండేలా ఈ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజాగా.. ఐపీఎల్ తెలుగు ప్రసారాలకు బ్రాండ్ అంబాసిడర్ హోదాలో.. ఆ ప్రమోషన్లలో పాల్గొన్న ఎన్టీఆర్‌ను చూసిన వారంతా ఆశ్చర్యపడ్డారు.
ఈ ప్రమోషన్స్‌లో ఫిట్‌గా.. చాలా వరకు బరువు తగ్గినట్లు తారక్ కనిపించారు. త్రివిక్రమ్‌తో కలిసి చేయబోయే సినిమా కోసమే.. మూడు నెలల్లో 20 కిలోల వరకూ తగ్గానని.. మరింత బరువు కూడా తగ్గనున్నట్లు ఈ సమావేశంలో తెలియజేశారు యంగ్ టైగర్.
ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్‌కు వృత్తిపై ఉన్న అంకిత భావం ఎటువంటిదో గతంలో 'యమదొంగ' సినిమా విషయంలోనే తెలిసిందని.. ఇప్పుడు మరోసారి అది నిరూపితమైందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments