kantamaneni uma maheswari : ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం.. శోకసంద్రంలో అన్నగారి ఫ్యామిలీ

  • IndiaGlitz, [Monday,August 01 2022]

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి సోమవారం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్- బసవ తారకం దంపతులకు ఆమె నాలుగో కుమార్తె. అయితే ఉమా మహేశ్వరి మరణానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.

నాలుగేళ్ల క్రితం హరికృష్ణ దుర్మరణం:

2018 ఆగస్ట్ 29న ఎన్టీఆర్ కుమారుడు , మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి అన్నగారి కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఉమామహేశ్వరి కన్నుమూయడంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మరణవార్త తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌లు ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లారు. అటు విదేశాల్లో వున్న మరికొందరు కుటుంబ సభ్యులు కూడా భారత్‌కు రానున్నారు.

మొన్ననే కూతురి పెళ్లి .. అంతలోనే ఇలా:

కొద్దిరోజుల క్రితమే ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అల్లుల్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. దాదాపు పాతికేళ్ల నుంచి నారా- దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజకీయ వైరం వుంది. ఎన్టీఆర్‌ను గద్దెను దించిన తర్వాతి నుంచి వీరిద్దరూ ఎదురుపడి మాట్లాడింది లేదు. చంద్రబాబుపై పుస్తకాల రూపంలో తన అక్కసు తీర్చుకునేవారు దగ్గుబాటి. అలాంటి మళ్లీ తోడల్లుళ్లిద్దరూ ఒకే వేదికపైకి రావడంతో నందమూరి కుటుంబ సభ్యులు , టీడీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దగ్గుబాటికి గుండెపోటు రావడంతో అపోలోకి వెళ్లి పరామర్శించారు చంద్రబాబు.

More News

Janasena : అమ్ముడుపోతారంటూ జగన్ వ్యాఖ్యలు.. కాపు నాయకులకు పౌరుషం లేదా: జనసేన నేత విజయ్ కుమార్

కాపుల సంక్షేమానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో శుక్రవారం

Janasena : పరామర్శలో పళ్లికిలిస్తారా.. అది మన బటన్ రెడ్డికే సాధ్యం : జగన్‌పై జనసేన నేత రియాజ్ సెటైర్లు

కాపు సామాజిక వర్గంతోపాటు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ షేక్ రియాజ్. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన

Janasena : కాపులు ఓట్లు అమ్ముకున్నారా, రుజువు చేయకుంటే ... జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: పంతం నానాజీ

మొదటి నుంచి కాపులను కించపరచడానికి.. వారిని అవహేళన చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ. కాకినాడ

దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది: అశ్వనీదత్

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.

Janasena Party : దసరా నుంచి ఏపీ రాజకీయాల్లో మార్పులు.. పవన్ యాత్రతో ఇకపై సంచలనాలే : నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు

వ్యవసాయం కోసం చేసిన అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.