కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `అరవింద సమేత`. అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎమోషనల్‌గా సాగింది. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు. తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదో రోజునే ఎన్టీఆర్ షూటింగ్‌కు హాజరై సినిమాను అనుకున్న సమయంలో పూర్తయ్యేలా చూసుకున్నాడు. తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్ వేడుక సందర్భంగా స్టేజీపై ఆయన్ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
`తన తండ్రికి అంతకన్నా అద్భుతమైన కొడుకు ఉండడు. కొడుక్కి అంత కన్నా అద్భుతమైన తండ్రి ఉండడు. ఒక భార్యకి అంతకన్నా అద్భుతమైన భర్త ఉండడు. మనవడికి, మనవరాలికి అంతకన్నా అద్భుతమైన తాత ఉండడు. బ్రతికి ఉన్నంత వరకు ఎన్ని సార్లో నాకు, మా అన్నకు చెప్పాడో నాకు తెలుసు.. `నాన్నా.. మనమేదో చాలా గొప్పవాళ్లం అని కాదు. ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను. నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని మోసుకెళ్లేది అభిమానులే. బ్రతికున్నంత వరకు..` నాన్నా అభిమానులు జాగ్రత్త. మనం వాళ్లకు ఏం చేయకపోయినా.. వాళ్లు మనకు ఏం చేస్తున్నారో.. నాకు తెలుసు. నాన్నా.. అభిమానులు జాగ్రత్త ` అని చాలా సార్లు అనేవారు.
ఈ ఒక్క సినిమాకు ఆయన ఉండి ఉంటే బావుండేది. మనకు ఆయన అవసరం ఎంతుందో కానీ, పైన ఆయనకు (ఎన్టీఆర్)కు ఆయన (హరికృష్ణ) అవసరం ఎంత ఉందో తెలియదు మరి. చాలా సార్లు ఆడియో వేడుకల్లో తాతగారి బొమ్మను చూసేవాడిని. కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఊహించలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, అభిమానులు అందరి గుండెల్లో, అందరి ముఖాల్లో ఆయన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటనే మీ అందరికీ ఇస్తున్నాను`` అని అన్నారు ఎన్టీఆర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com