ఎన్టీఆర్ మరో రికార్డ్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడులైన చిత్రం `అరవింద సమేత`.. `వీర రాఘవ`. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతంగా మంచి కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఓవర్‌సీస్‌లో 1.5 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది.
ఈ వారాంతరంలో రెండు మిలియన్స్‌కు రీచ్ కానుంది. దీంతో వరుసగా నాలుగు చిత్రాలు 1.5 మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసిన తొలి హీరోగా ఎన్టీఆర్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన నటించిన నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ చిత్రాలు 1.5 మిలియన్ మార్కు అందుకున్నాయి. వీటి తర్వాత వచ్చిన `అరవింద సమేత..` కూడా ఈ క్రెడిట్‌ను దక్కించుకుని ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్నిచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments