మ‌రోసారి తండ్రి అయిన ఎన్టీఆర్‌...

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యారు. ఎన్టీఆర్‌, ప్ర‌ణతిల‌కు మ‌గ‌బిడ్డ పుట్టాడు. 'నా కుటుంబం పెద్దదైంది, మ‌గ‌బిడ్డ‌' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయ‌డం ద్వారా అస‌లు విష‌యాన్ని అంద‌రికీ తెలిపారు.

ఆయ‌న అభిమానులు ఆనందంలో ఉన్నారు. సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్‌కు ప‌లువురు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ఎన్టీఆర్‌, ప్ర‌ణ‌తిల‌కు ఇప్ప‌టికే అభ‌య్ రామ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.