నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్.. గౌతమ్ హ్యాట్సాప్: ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్-19న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. పలువురు ప్రముఖులు ‘జెర్సీ’ని చూసి నాని నటనను.. సినిమాను తెరకెక్కించిన గౌతమ్‌ను మెచ్చుకుంటున్నారు. ‘జెర్సీ’ చిత్రం చూసిన తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. దర్శకుడిపై గౌతమ్‌పై ఓ ట్వీట్.. మరో ట్వీట్ నానీ నటన, చిత్రబృందంపై జూనియర్ ట్వీట్ చేశాడు.
గౌతమ్ హ్యాట్సాప్...
"గౌతమ్ తెరకెక్కించిన ‘జెర్సీ’ చిత్రం అద్భుతంగా ఉంది. ఈ మూవీ నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి కథని ఎంచుకుని, దానిని చక్కగా తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి హ్యాట్సాఫ్. దర్శకుడి విజన్‌కు తగ్గట్లుగా చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు కనిపిస్తోంది" అని దర్శకుడిపై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్..
"నాని బ్రో.. నువ్వు కొడితే బంతి స్టేడియం బయట పడింది. బ్రిలియంట్.. బ్రిలియంట్.. బ్రిలియంట్.. పెర్ఫామెన్స్..! నీ పెర్ఫామెన్స్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అని నానీ నటనను ఎన్టీఆర్ మెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే.. యువ కథానాయకుల్లో నానిది ప్రత్యేక శైలి అని చెప్పుకోవచ్చు. వైవిధ్యమైన కథా చిత్రాలను ఎంచుకుంటున్న నానీ అభిమానులను, సీని ప్రియులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో 8 వరుస విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోగా కూడా నాని మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే నాని గత చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. ఇవాళ విడుదలైన ‘జెర్సీ’ మొదటి రోజే హిట్ టాక్ వచ్చింది. విమర్శకులు సైతం ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments