ఎన్టీఆర్..విమర్శకులపై నోరు జారాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం `జై లవకుశ`. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదలైంది. అయితే విడుదల రోజు డివైడ్ టాక్ వచ్చింది. కొంత మంది రివ్యూ రైటర్స్ సినిమా బావుందని అంటే మరికొందరు బాగా లేదని అన్నారు. ఈ విషయంపై ఎన్టీఆర్ సినిమా సక్సెస్ మీట్‌లో స్పందించాడు. సినిమాను ఎమెర్జన్సీ ఉన్న పెషంట్‌గా, బంధువులు, చుట్టాలుగా చిత్రయూనిట్‌ను, డాక్టర్స్‌గా ప్రేక్షకులగా పోల్చిన ఎన్టీఆర్ రివ్యూ రైటర్స్‌ను మాత్రం దారిన పోయే దానయ్యలు అంటూ మండిపడ్డాడు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంస్కృతి మొదలైంది. విడుదలైన సినిమా ఎమెర్జెన్సీలోని పెషంట్ అయితే, పెషంట్‌పైనే అసలు పెట్టుకున్న బంధువులు, చుట్టాలు మేము, డాక్టర్స్ ప్రేక్షకులు అయితే దారిన పోయే దానయ్యలు కొంత మంది విశ్లేషకులు. పెషంట్ చచ్చిపోతాడా? లేదా? అని చెప్పాల్సింది డాక్టర్లనే ప్రేక్షకులు. ఇది మాకే కాదు, మా అందరికీ జరుగుతున్న ప్రక్రియ. మనం మాట్లాడే మాట, ఎదుటి వ్యక్తి పరిస్థితిని ఎంత దిగజారుస్తుందో ఆలోచించండి. తప్పులుంటే క్షమించండి, అర్థమే లేదనుకంటే వదిలేయండిసస అన్నారు. సినిమా రివ్యూలన్న తర్వాత నచ్చినవాడికి నచ్చినట్లు రాస్తారు. దీని కోసం ఇంత పెద్దగా ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలియడం లేదని కొందరు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments