చీపురు పట్టిన తారక్.. ఎవరికి ఛాలెంజ్ విసిరాడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్ వేళ సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లల్లోకి పని మనుషులను కూడా సెలబ్రిటీలు రానీయడం లేదు సరికదా! ఎవరింటి పనిని వారే చేసుకుంటున్నారు. అంత వరకు బాగానే ఉంది. అయితే ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా ఓ సరికొత్త ఛాలెంజ్‌ను షురూ చేయడంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. అసలు విషయంలోకి వెళితే ఆదివారం రోజున సందీప్ వంగా ఇంటి పనులన్నింటినీ చేసి ..ఇంట్లోని అసలు మగాడెవడూ ఇలాంటి క్వారంటైన్ సమయంలో ఇళ్లల్లోని మహిళలతో పనిచేయించరు..‘బీ ది రియల్ మేన్’ అంటూ రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. దానికి స్పందించిన రాజమౌళి ఇంటి పనులను పూర్తి చేసి ఛాలెంజ్‌ను తారక్, చరణ్, కీరవాణి, సుకుమార్, శోభు యార్లగడ్డకు విసిరారు.
ఇందులో ముందుగా తారక్ స్పందించారు. మంగళవారం ఉదయమే ఇంటి పనులను చేశారు. ఇల్లు తుడవడం, పాత్రలను బట్టతో శుభ్రం చేయడంతో పాటు తోటనంతటినీ క్లీన్ చేశారు. దాన్ని వీడియోను, అలాగే ‘‘ప్రేమ, ఆప్యాయతలే కాదు..ఇంట్లోని పనులను కూడా పంచుకుందాం. అలా పంచుకుంటే వచ్చే సరదానే వేరు. బీ ద రియల్ మేన్’’ అని మెసేజ్ ట్వీట్ చేశాను. అలాగే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు కొరటాల శివలకు తారక్.. బీ ద రియల్‌మేన్ ఛాలెంజ్‌ను విసిరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments