చీపురు ప‌ట్టిన తార‌క్‌.. ఎవ‌రికి ఛాలెంజ్ విసిరాడంటే..?

లాక్‌డౌన్ వేళ సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్ల‌ల్లోకి ప‌ని మ‌నుషుల‌ను కూడా సెల‌బ్రిటీలు రానీయ‌డం లేదు స‌రిక‌దా! ఎవ‌రింటి ప‌నిని వారే చేసుకుంటున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఓ స‌రికొత్త ఛాలెంజ్‌ను షురూ చేయ‌డంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఛాలెంజ్‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. అస‌లు విష‌యంలోకి వెళితే ఆదివారం రోజున సందీప్ వంగా ఇంటి ప‌నుల‌న్నింటినీ చేసి ..ఇంట్లోని అస‌లు మ‌గాడెవ‌డూ ఇలాంటి క్వారంటైన్ స‌మ‌యంలో ఇళ్ల‌ల్లోని మ‌హిళ‌ల‌తో ప‌నిచేయించ‌రు..‘బీ ది రియ‌ల్ మేన్‌’ అంటూ రాజ‌మౌళికి ఛాలెంజ్ విసిరాడు. దానికి స్పందించిన రాజమౌళి ఇంటి ప‌నుల‌ను పూర్తి చేసి ఛాలెంజ్‌ను తార‌క్‌, చ‌ర‌ణ్‌, కీర‌వాణి, సుకుమార్,  శోభు యార్ల‌గ‌డ్డకు విసిరారు.

ఇందులో ముందుగా తార‌క్ స్పందించారు. మంగ‌ళ‌వారం ఉద‌య‌మే ఇంటి ప‌నుల‌ను చేశారు. ఇల్లు తుడ‌వ‌డం, పాత్ర‌ల‌ను బ‌ట్ట‌తో శుభ్రం చేయ‌డంతో పాటు తోట‌నంత‌టినీ క్లీన్ చేశారు. దాన్ని వీడియోను, అలాగే ‘‘ప్రేమ, ఆప్యాయతలే కాదు..ఇంట్లోని పనులను కూడా పంచుకుందాం. అలా పంచుకుంటే వచ్చే సరదానే వేరు. బీ ద రియల్ మేన్’’ అని మెసేజ్ ట్వీట్ చేశాను. అలాగే  బాల‌కృష్ణ‌, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేశ్‌ల‌తో పాటు కొర‌టాల శివల‌కు తార‌క్.. బీ ద రియ‌ల్‌మేన్ ఛాలెంజ్‌ను విసిరారు.

More News

మహారాష్ట్రను కాటేస్తున్న కరోనా.. ఒక్కరోజే 283 కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎప్పుడు ఎవరికి కరోనా సోకుతుందో..? ఎటు నుంచి ఎవరికి సోకుతుందో..? అని ప్రజలు హడలెత్తిపోతున్నారు.

ఆయురారోగ్యాలతో ఉండాలి.. : బాబుకు పవన్ బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో 872కు చేరుకున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 872కు చేరుకుంది.

ఇకపై చిరు సినిమాలన్నీ కుర్ర దర్శకులతోనే!?

రాజకీయాలకు రాం రాం చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయడానికి సీనియర్, కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారు.

గుంటూరులో యువకుడి చావుకు కారణమేంటి.. !?

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా కాటేస్తున్న తరుణంలో ఘోరం జరిగిపోయింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని మొహమ్మద్ గౌస్ అనే యువకుడ్ని పోలీసులు కొట్టారని..