బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు... ఘనంగా ఏర్పాట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు అన్న నందమూరి తారక రామారావు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకునిగా తెలుగు సినీ ప్రతిష్ఠని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఆయన.
కథానాయకుడిగా తనకు ఎంతో కీర్తి ప్రతిష్టలను అందించిన ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానమే కాదు పొలిటికల్ ఎంట్రీ కూడా ఓ సంచలనమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని కదిలించిన తొలి వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం, ఆయన పలుకు ఓ సంచలనం.. ఆయన మాట ఓ తూటా.. ఆయన సందేశమే స్పూర్తి.
తెలుగు జాతిపై అంతటి ముద్ర వేసిన ఆ మహనీయుని శతజయంతి వేడుకలు ఈ ఏడాది మే 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ చేతుల మీదుగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కాన్నునాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 28 ఉదయం బాలయ్య చేతుల మీదుగా వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం గుంటూరులో, సాయంత్రం తెనాలిలో వేడుకలు జరుగుతాయి. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలోనే ఈ ఏడాది పొడవునా వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout