ఎన్టీఆర్ బయోపిక్ మరింత ఆలస్యం?

  • IndiaGlitz, [Tuesday,February 27 2018]

మ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవితక‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న‌ చిత్రం య‌న్.టి.ఆర్'. నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌డ‌మే కాకుండా.. ఓ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరి కూడా ఈ చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ప్రారంభం కావ‌ల‌సి ఉంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా నిర్మాణంలో మ‌రింత ఆల‌స్యం జ‌రుగ‌నుంద‌ని తెలిసింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం..ఈ చిత్రం జులై నుంచి చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా కోసం ఏవో కొన్ని పాత్ర‌ల‌కు మిన‌హాయిస్తే.. మిగిలిన పాత్ర‌ల‌కు అంద‌రినీ కొత్త వారినే తీసుకుంటున్నార‌ట‌ తేజ. వాళ్ల‌కి శిక్ష‌ణనిచ్చిన‌ త‌ర్వాత‌నే చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌నున్నారు. ఈలోగా తేజ.. వెంక‌టేష్ తో చేయ‌నున్న సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ల‌నున్నారు. ఇక సాయి కొర్ర‌పాటి కూడా చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ హీరోగా చేయ‌నున్న చిత్రంతో బిజీగా ఉండనున్నారు. అంతేగాకుండా.. నిర్మాత సి.క‌ళ్యాణ్ బ్యాన‌రుపై బాల‌కృష్ణ కూడా మ‌రో చిత్రం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో.. య‌న్.టి.ఆర్' చిత్రం జులై నుంచే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్ల‌వుతోంది.