'యన్.టి.ఆర్' టైటిల్ మారింది...
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథను 'యన్.టి.ఆర్' బయోపిక్‌గా .. రెండు భాగాలుగా తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంటుంది. నిన్నటి వరకు కేవలం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరకే సినిమాగా ఉంటుందని వార్తలు వచ్చాయి.
అయిన రెండు మూడు రోజుల నుండి ఈ బయోపిక్ మరో భాగం ఉంటుదనే దానిపై వార్తలు ఎక్కువగా వినిపించాయి. అందుకు తగినట్లుగా ముందుగా అనుకున్న బయోపిక్ టైటిల్ 'యన్.టి.ఆర్'ను మార్చారు.
'యన్.టి.ఆర్ కథానాయకుడు' పేరుతో ఈ సినిమాను జనవరి 9న విడుదల చేస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి కొనసాగింపుగా రెండో భాగం ఉంటుందా? అనే దానిపై యూనిట్ ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments