మనదేశం సందర్భం తో 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,July 05 2018]

మహానీయుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైన సందర్భంగా ఈరోజును చారిత్రాత్మక రోజుగా పరిగనించవచ్చు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకేక్కబోతున్న 'ఎన్టీఆర్' సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది.

స్వర్గీయ నందమూరి తారకరామారావ్ తన మొదటి సినిమా రంగప్రవేశం 'మనదేశం' సినిమాతో జరిగింది. మనదేశం సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ బాలకృష్ణ చెప్పారు. ఈ సీన్ ను గురువారం 'ఎన్టీఆర్ బయోపిక్' కోసం షూట్ చేశారు. ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం.

అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ స్వయంగా 1975లో ఒక ఉత్తరం రాయడం జరిగింది. అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి, ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా ఋణపడ్డట్టే. నాడు నేడు 'మనదేశం' తోనే చరిత్రకు శ్రీకారం.
నా శుభాకాంక్షలు, సోదరుడు రామారావు అని ఎన్టీఆర్ రాసిన ఉత్తరాన్ని నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా వారు తెలుగు ప్రేక్షకుల ఆధర అభిమానాలు కోరుకున్నారు. 'మనదేశం' చిత్ర సీన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు బాలకృష్ణ, క్రిష్ తెలిపారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్

More News

నాగార్జున, నాని సినిమా టైటిల్ 'దేవదాస్'

నాగార్జున & నాని మల్టిస్టార్టర్ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు 'దేవదాస్' టైటిల్ ను ఖరారు చేసారు.

అరుణ్ ఆదిత్ హీరోగా 'జిగేల్' ప్రారంభం 

"కథ" చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అరుణ్ ఆదిత్ ఇటీవల "పి.ఎస్.వి గరుడ వేగ"

'8కె' కెమెరాతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న‌ తొలి సినిమా 'యు'

కొవెర  హీరోగా త‌నికెళ్ల భ‌ర‌ణి, 'శుభ‌లేఖ‌' సుధాక‌ర్ ముఖ్య పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం 'యు'. దీనికి ఉప‌శీర్షిక 'క‌థే హీరో'.

మ‌హేష్ 25 విష‌యంలో దిల్ రాజు సెంటిమెంట్‌

ఏప్రిల్ నెలకి, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజుకి విడదీయరాని బంధం ఉంది.

బ‌న్ని రెండు కొత్త చిత్రాల అప్‌డేట్స్‌

ఇటీవ‌ల విడుద‌లైన‌ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో న‌టుడిగా మ‌రింత గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.