ఉగాది నుంచి ఎన్టీఆర్ బయోపిక్?
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది కాలంగా అలుపన్నది లేకుండా వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరుసగా 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్', 'జై సింహా' సినిమా షూటింగ్ లలో పాల్గొని.. నేటి యువ కథానాయకులకు ఛాలెంజ్ విసిరారు బాలయ్య. 'జై సింహా' తర్వాత ఆకట్టుకునే కథలు ఆయన వద్దకు రాకపోవడంతో.. కొంత విశ్రాంతి తీసుకుని నేరుగా ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే ఆలోచనలో బాలయ్య ఉన్నారని సమాచారం.
బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'యన్.టి.ఆర్' మూవీకి సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మ తేజ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాకి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నటీనటులను ఎంపిక చేసినట్టు సమాచారం.
హాలీవుడ్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం కొంత స్కెచ్ వర్క్ ను చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని సుమారు రూ. 60 కోట్లతో నిర్మించనున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన 'యన్.టి.ఆర్' సినిమాని.. అదే తెలుగు పండుగ "ఉగాది"ని పురస్కరించుకుని మార్చి 18న ప్రారంభకార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే జూన్ నెల నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరిపేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com