ఉగాది నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్‌?

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

గత ఏడాది కాలంగా అలుపన్నది లేకుండా వరుస సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా గడిపారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరుసగా 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్', 'జై సింహా' సినిమా షూటింగ్ లలో పాల్గొని.. నేటి యువ కథానాయకులకు ఛాలెంజ్ విసిరారు బాలయ్య. 'జై సింహా' తర్వాత ఆకట్టుకునే కథలు ఆయన వద్దకు రాకపోవడంతో.. కొంత విశ్రాంతి తీసుకుని నేరుగా ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే ఆలోచనలో బాలయ్య ఉన్నారని సమాచారం.

బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'యన్.టి.ఆర్' మూవీకి సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మ తేజ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాకి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నటీనటులను ఎంపిక చేసినట్టు సమాచారం.

హాలీవుడ్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం కొంత స్కెచ్ వర్క్ ను చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని సుమారు రూ. 60 కోట్లతో నిర్మించనున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన 'యన్.టి.ఆర్' సినిమాని.. అదే తెలుగు పండుగ "ఉగాది"ని పురస్కరించుకుని మార్చి 18న ప్రారంభకార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే జూన్ నెల నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరిపేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది.

More News

సామ్ , చైతు చిత్రాన్ని నిర్మించనున్న నాని నిర్మాతలు

ఆ జంటను చూసి పులకించడం వెండితెర వంతైతే..వెండితెర పై ఆ జంట కెమిస్ట్రీ చూసి పరవశించడం ప్రేక్షకుల వంతు.‘ఏ మాయ చేశావే’,‘మనం’,‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో ప్రేక్షకులకు కనువిందు చేసిన ఆ జంట..

నాని, కిషోర్ తిరుమల సినిమాకి బ్రేక్ పడిందా?

కొన్ని కాంబినేషన్స్ లో తొలిసారిగా సినిమాలు రాబోతున్నాయంటే ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది.

ప్ర‌మోష‌న్ కోసం..'శివ'ను వాడుకోనున్న వర్మ‌

నాగార్జున, రాంగోపాల్ వర్మ పేర్లు చెబితే ఠక్కున గుర్తుకొచ్చేది 'శివ' చిత్రం. 28 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. 'శివ' పేరు చెబితే పోస్టర్లో ఆ పేరు పై నుంచి చేతితో సైకిల్ చైన్ పట్టుకున్న దృశ్యం గుర్తుకొస్తుంది. అలాగే మొదటి ఫైట్ సన్నివేశంలో.. నాగ్ సైకిల్ చైన్ తెంపే సీన్ కళ్ళ ముందు కదలాడుతుంది.

స్వీటీ డబ్బింగ్ చెప్పలేకపోవడానికి కారణం అదేనా

తెలుగు సినిమాల్లోకి కొత్తగా వస్తున్న పరభాషా కథానాయికలు సైతం డబ్బింగ్ చెప్పుకుంటూ అందరి ప్రశంసలను పొందుతున్నారు.

డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఓ సినిమాని నిర్మించనున్న సంగతి తెలిసిందే.