close
Choose your channels

ఆగష్టు నుంచి యన్.టి.ఆర్ బయోపిక్

Wednesday, January 24, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహానటుడు, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా య‌న్‌.టి.ఆర్`. ఆయన కుమారుడు బాలకృష్ణ .. తండ్రి య‌న్‌.టి.ఆర్ పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా వుంటే...ఈ సినిమా స్పెషల్ టీజర్ ని య‌న్‌.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.కాని సమయానుభావం వలన అది వాయిదా పడింది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించి.. ఈ మధ్య మీడియాలో చాలా కథనాలే వినిపించాయి. తేజ ఇటు ఎన్టీఆర్` బయోపిక్ చిత్రానికి, అటు వెంకటేష్ ఆటా నాదే వేటా నాదే` సినిమాకి కూడా దర్శకుడు కావడంతో....డైలమాలో పడ్డారని విభిన్న కథనాలు వినిపించాయి. అయితే వీటన్నింటికి తెర దించుతూ నిన్న హైదరాబాద్ లో జరిగిన జై సింహా` రూ.50 కోట్ల క్లబ్ వేడుకలో స్వయానా బాలకృష్ణ.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుంచి జరగబోతోందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు తేజ.. వెంకటేష్ సినిమాని ఆగష్టు కల్లా పూర్తి చేసి.. ఆ త‌రువాత య‌న్‌.టి.ఆర్` బయోపిక్ ని తెరకెక్కిస్తారని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment