డిసెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ఆడియో, ట్రైల‌ర్ లాంఛ్.. 

  • IndiaGlitz, [Tuesday,December 18 2018]

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో మ‌రియు ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్, ఫిల్మ్ న‌గ‌ర్ లోని JRC క‌న్వెన్ష‌న్ లో జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

ఎన్టీఆర్ టీం అంతా ఈ వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు ఎన్టీఆర్ ఆడియో వేడుక‌ కార్య‌క్ర‌మం మొద‌లు కానుంది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది.