అనుష్క సినిమాలో ఎన్టీఆర్ విల‌న్

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళ న‌టుడు ఉన్నిముకుంద‌న్ రీసెంట్ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ వ‌ర్క్‌ను పూర్తి చేశాడు. అలాగే అనుష్క స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడ‌ట‌. ప్రాజెక్ట్‌పై సిగ్నేచ‌ర్ కూడా చేశాడు. ఈ విష‌యాన్ని ఉన్ని ముకుంద‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు.

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో సాగే థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ భాగ‌మ‌తిలో లీడ్‌లో రోల్‌లో ఈ మ‌ల‌యాళ నటుడు క‌నిపిస్తాడ‌ట‌. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఆది పినిశెట్టి ప్లేస్‌లో ఉన్ని ముకుంద‌న్ ను తీసుకున్నారా లేదా త‌ను కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నాడా అని తెలియాలి.