ఎన్టీఆర్ సింగర్.. రెండు సినిమాలు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలోని జరజర పాకే విషంలా.. అంటూ సాగే పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాట పాడిన ఆండ్రియా ఆ తరువాత తమిళ్, తెలుగు భాషల్లో కథానాయికగానూ, ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లోనూ సందడి చేసింది. తడాఖా వంటి హిట్ చిత్రంలో ఆమె సునీల్ పక్కన నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
కాగా, ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున తెలుగు తెరపై సందడి చేయనున్నాయి. అయితే ఆ రెండు కూడా తమిళ అనువాద చిత్రాలే కావడం గమనార్హం. విశాల్ హీరోగా నటించిన తమిళ చిత్రం తుప్పరివాలన్.. డిటెక్టివ్ పేరుతో తెలుగులో అనువాదమౌతున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఆండ్రియా ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈ నెల 10న ఆ సినిమా విడుదల కానుండగా.. అదే రోజు సిద్ధార్థ్‌తో ఆమె నటించిన హారర్ చిత్రం గృహం కూడా విడుదల కాబోతోంది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా తమిళనాట విజయం సాధించాయి. మరి తెలుగులోనూ ఆ ఫలితాలు రిపీట్ అవుతాయేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments