RRR: కొమరం భీం గురిపెడితే గుండెల్లో దిగాల్సిందే
Send us your feedback to audioarticles@vaarta.com
జూ. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కొమరం భీం లుక్ విడుదల చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న లుక్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంబరాలు మొదలు పెట్టేశారు. ఎన్టీఆర్ లుక్ పవర్ ఫుల్ గా ఉంటూ అలరిస్తోంది.
నలుపు రంగు కుర్తా, తెల్లటి దోతి నడుముకి ఎర్ర కండువా.. ఇలా ఒక విప్లవ వీరుడు ఎలా ఉంటాడో అలా ఎన్టీఆర్ లుక్ ఉంది. అన్నింటికీ మించి ఆకర్షిస్తున్న అంశాలు రెండు. ఒకటి చురకత్తులాంటి ఎన్టీఆర్ చూపు, రెండవది చేతిలో పదునైన బల్లెం. తాను గురిపెడితే శత్రువుల గుండెల్లో బల్లెం దిగాల్సిందే అన్నట్లుగా ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ ఉంది.
ఇదీ చదవండి: భాయ్ ని నమ్ముకుంటే 'జీ'కి దెబ్బ పడిందా?
అల్లూరి పాత్రకు నిప్పుని, కొమరం భీం పాత్రకు నీరుని రాజమౌళి సిగ్నేచర్ గా ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ లో కూడా బ్యాగ్రౌండ్ లో ఎగసి పడుతున్న కెరటాలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ పై రాజమౌళి తనదైన శైలిలో కామెంట్ చేశారు. ' నా భీం మనస్సు బంగారం. కానీ అతడు తిరగబడితే మాత్రంబలంగా, ధైర్యంగా నిలబడతాడు' అని రాజమౌళి కామెంట్ చేశారు.
దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా పరిగణించబడుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ అప్పటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments