మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఎన్టీఆర్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `అరవింద సమేత...`. ఇందులో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్, త్రివిక్రమ్, తమన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాల్గొంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments