రికార్డుల‌కు క్రియేట్ చేస్తున్న యంగ్ టైగ‌ర్‌...

  • IndiaGlitz, [Friday,October 12 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'అర‌వింద స‌మేత‌'.. 'వీర రాఘ‌వ‌' చిత్రంతో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రొటీన్‌కు ఫ్యాక్ష‌న్ చిత్రాల‌కు భిన్నంగా సినిమా ఉండ‌టం.. ఎన్టీఆర్ సెటిల్‌డ్ పెర్ఫామెన్స్‌.. డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ టేకింగ్ అన్నీ సినిమాకు హిట్‌ను తెచ్చిపెట్టాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌కుండా సినిమా క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేసింది. నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేశారు తార‌క్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 26.64 కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్ రావ‌డం విశేషం.
నైజాం -5.73
సీడెడ్ - 5.48
నెల్లూరు - 1.06
గుంటూరు - 4.14
కృష్ణా - 1.97
వెస్ట్ - 2.37
ఈస్ట్ - 2.77
ఉత్త‌రాంధ్ర - 3.12
మొత్తం - 26.64
ఇది కాకుండా ఓవ‌ర్ సీస్‌లో వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది. వీకెండ్‌కంతా రెండు మిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేయ‌నుందని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.