కథ మీది, కల మీది... ఆట నాది, కోటి మీది: ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ పేరుతో ప్రారంభం కానున్న షోలో తారక్ హోస్ట్‌గా కనిపించనున్నాడు. తొలిసారిగా తారక్.. బిగ్‌బాస్ సీజన్ 1తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెట్టినప్పటికీ అదరగొట్టేశాడు. హోస్ట్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. బిగ్‌బాస్ సీజన్ 4 కూడా పూర్తైంది. ప్రతి సీజన్ సమయంలోనూ ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తే బాగుండని ఆయన అభిమానులే కాదు.. బిగ్‌బాస్ ప్రేక్షకులంతా కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తిరిగిన టెలివిజన్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇన్నాళ్లకు తిరిగి బుల్లితెర ప్రేక్షకుల కోరిక తీరబోతోంది.

ఇప్పటికే ఓ ప్రోమో ద్వారా షో గురించి వెల్లడించిన జెమిని టీవీ.. తాజాగా యంగ్‌ టైగర్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ షో గురించి తారక్ చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. ‘‘హాయ్ ఈ ఆట గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఈ సీటు కొంచెం హాటు కదా.. ఇక్కడ కూర్చున్న వాళ్లు మొదట టకటకా ఆన్సర్లు చెప్పేస్తారు. సరిగ్గా లక్ష దాటాక మొదలవుతుంది టెన్షన్. ఛాయిస్ మనకు తెలిసినా చెమటలు పడతాయి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది.. లైట్లు బ్రేక్ అవుతాయి. ఆన్సర్ ఆడియన్స్‌కు తెలుసేమోనని పోలింగ్ పెడతారు. వాడెవడో ఫ్రెండ్‌కి ఐన్‌స్టీన్ అమ్మ మొగుడనుకుని ఫోన్ కొడతారు. ఫైనల్‌గా నావైపు చూస్తారు. ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చొన్నాడు వీడికేమైనా తెలుసేమోనని.

ఎబ్బే.. మీరు కరెక్ట్‌గా చెబితే తెలుసుకుందామని నేను వెయిటింగ్. ఇక్కడి నుంచి మీరెంత పట్టుకెళతారో నేను చెప్పలేను. కానీ లైఫ్‌లో నేను గెలవగలుగుతాననే కాన్ఫిడెన్స్‌ను మాత్రం కచ్చితంగా పట్టుకెళతారు. నాది గ్యారంటీ. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరుడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. సైనింగ్ ఆఫ్ మీ రామారావు’’ అంటూ తారక్ ప్రోమోలో వెల్లడించాడు. మొత్తానికి యంగ్ టైగర్ బుల్లితెరపై మరోసారి సందడి చేయబోతున్నాడు. షో సంగతేమో కానీ ఎన్టీఆర్ హోస్టింగ్ కోసమైనా చూసే ప్రేక్షకులు మాత్రం నూటికి నూరు శాతం ఉన్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌తో ఆయనొక ట్రెండ్ సెట్ చేసేశాడు. ఇప్పుడు ఈ షోని విజయ తీరాలకు నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు

More News

మాజీ సీఎం మనవడితో వైభవంగా మెహ్రీన్ నిశ్చితార్థం

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా.

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ హీరో తనీష్‌కు నోటీసులు

సినీ ఇండస్ట్రీని ఇప్పుడప్పుడే డ్రగ్స్ మహమ్మారి వదిలేలా లేదు. టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇటీవలే సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో విచారణకు రావాలంటూ హీరో తనీష్‌కు బెంగుళూరు

దేవిశ్రీ ప్ర‌సాద్ టీవీ షో... స్పెషాలిటీ అదే!

దేవిశ్రీ ప్ర‌సాద్‌కి సుడి మామూలుగా లేదు. మొన్న‌టికి మొన్నే ఉప్పెన బ్లాక్ బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప ప్యాన్ ఇండియా మూవీ రెడీ అవుతోంది. మ‌రో వైపు శివ‌రాత్రి సంద‌ర్భంగా

జనసేనకు ఆ అధికారం లేదు.. ఎస్‌ఈసీ షాక్

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎస్‌ఈసీ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి.

ఆ స‌మ‌స్య‌పై గొంతు విప్పుతున్న స‌మంత‌... స్పందిస్తారంటారా?

స‌మంత ఇప్పుడు ఓ స‌మ‌స్య మీద గొంతు విప్పుతున్నారు. అదీ నిన్నా మొన్న‌టిదాకా బాలీవుడ్‌లో చాలా మంది మాట్లాడిన విష‌య‌మే. అడ‌పాద‌డ‌పా టాలీవుడ్‌లోనూ విన్న విష‌య‌మే.