ఎన్టీఆర్ 'ఆది' కి 14 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'ఆది'. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇదే. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో తారక్ నటన నందమూరి అభిమానులనే కాదు.. తెలుగు సినిమా ప్రియులను అలరించింది.
'అమ్మ తోడు.. అడ్డంగా నరికేస్తా..' అంటూ ఎన్టీఆర్ పలికే సంభాషణ అప్పట్లో ఓ సంచలనం. మణిశర్మ సంగీతమందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదరణ పొందాయి. కీర్తి చావ్లా హీరోయిన్గా పరిచయమైన ఈ సినిమా రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. దాదాపు రూ.20 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. 121 కేంద్రాల్లో 50 రోజులు.. 96 కేంద్రాల్లో 100 రోజులు.. 3 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమైన 'ఆది' చిత్రం విడుదలై నేటితో (మార్చి 28)కి 14 సంవత్సరాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com