అఫీషియ‌ల్‌:  ఎన్టీఆర్ 30.. త్రివిక్ర‌మే ద‌ర్శ‌కుడు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వినిపించాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తాడ‌ని, కాదు..వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ అధికారికంగా సినిమాను అనౌన్స్ చేసింది.

ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ చేస్తున్నాడు. ఎప్ప‌టిలాగానే త్రివిక్ర‌మ్ సినిమాల‌ను నిర్మించ‌చే హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా నిర్మాణంలో భాగ‌స్వామిగా మార‌డం విశేషం. అంటే ఎస్‌.రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌లుగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు జూన్ నెల‌కంతా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. తర్వాత‌నే ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళుతుంది. రీసెంట్‌గా అల వైకుంఠ‌పుర‌ములోతో భారీ హిట్ కొట్టిన త్రివిక్ర‌మ్.. ఎన్టీఆర్‌ను మ‌రోసారి డైరెక్ట్ చేయనున్నారు. ఇంత‌కు ముందు అర‌వింద‌స‌మేత సినిమా ..వీరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. జూన్ త‌ర్వాత ప్రారంభం కాబోయే ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుదల కానుంది.