అర్థరాత్రి స్టైలిష్‌గా వచ్చి సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్ అర్థరాత్రే వచ్చేసింది. సక్సెస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మరోసారి యంగ్ టైగర్ చేయబోతున్నాడంటూ ఎప్పటి నుంచో వార్తలు వినవస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా కూడా అనౌన్స్ అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్‌రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. తారక్ 30వ చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది.
ఇదీ చదవండి: RRR: కొమరం భీం గురిపెడితే గుండెల్లో దిగాల్సిందే
ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 టీమ్ ఒక స్టైలిష్ ఫోటోని షేర్ చేసింది. ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్ స్మార్ట్ లుక్‌తో ఇన్‌షర్ట్ చేసుకుని చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ క్రితమే ఎన్టీఆర్, కొరటాల కాంబో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వీరిద్దరూ వచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోందని ఇప్పటికే కొరటాల శివ వెల్లడించారు.
పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో కొరటాల భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే, తారక్ తన 30వ చిత్రాన్ని మొదట త్రివిక్రమ్‌తో ప్రకటించిన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ని ప్రస్తుతానికి పక్కనబెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నాడు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com