ద్విభాషా చిత్రంగా ఎన్టీఆర్ 30?

  • IndiaGlitz, [Sunday,May 20 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న మల్టీస్టారర్ మూవీలో రామ్ చరణ్ తో పాటు క‌లిసి నటించబోతున్నారు తార‌క్‌. ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఎన్టీఆర్. గ‌తంలో ఎన్టీఆర్ హీరోగా ‘స్టూడెంట్ నెం 1’, ‘కంత్రి’, ‘శక్తి’ లాంటి సినిమాలను నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. తమిళ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నార‌ని క‌థనాలు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం.. తెలుగు, తమిళ్ భాష‌ల్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. అదే గ‌నుక కార్య‌రూపం దాల్చితే.. ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి బైలింగ్వల్ మూవీ ఇదే అవుతుంది. ఎన్టీఆర్ 30గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి.

More News

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన 'పెళ్ళంటే' చిత్రం

శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...?

'అభిమన్యుడు' ద‌ర్శ‌కుడితో కార్తి చిత్రం

విశాల్ స్వీయనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుంబుతిరై’. ఈ చిత్రంతో పి.ఎస్.మిత్రన్ దర్శకుడిగా పరిచయమయ్యారు.

అనుపమ ప్రతిభకి ఫ్లాట్ అయిపోయిన మెగాహీరో

సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో

ఈ ఏడాదిలో డ‌బ్బింగ్‌తో ఆక‌ట్టుకున్న క‌థానాయిక‌లు

తొలితరం అగ్ర కథానాయికల దగ్గర నుంచి.. ఆ తర్వాత తరంలో వచ్చిన శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి అగ్ర కథానాయికల

తీవ్ర అనారోగ్య ప‌రిస్థిలో మాదాల రంగారావు

విప్ల‌వ న‌టుడు, నిర్మాత‌, రెడ్‌స్టార్ మాదాల రంగారావు గారు నిన్న అన‌గా మే 19 తేదీ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌తో,