ఎన్టీఆర్ టైటిల్....

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తాగ్యారేజ్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు త‌ర్వాత వెంట‌నే సినిమా చేయ‌లేదు. చాలా క‌థ‌లు విన్న‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ బాబీ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అయితే ఈలోపు ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమాలు గురించి వార్త‌లు అవి, ఇవి అంటూ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ఎన్టీఆర్‌, బాబీ చిత్రాన్ని య‌న్‌.టి.ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే చేయ‌బోతున్నట్టు క‌ల్యాణ్‌రామ్ క‌న్‌ఫ‌ర్మ్ చేసేశాడు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు రోల్స్‌లో క‌న‌ప‌డుతున్నాడని, సినిమాలో ఎన్టీఆర్ నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. తాజాగా సినీ ఫీల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంద‌ట అందుక‌ని ఈ చిత్రానికి 'న‌ట విశ్వ‌రూపం' అనే టైటిల్ పెట్ట‌బోతున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వ‌రుస విజ‌యాల మీదున్న ఎన్టీఆర్, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్లాప్ త‌ర్వాత బాబీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందోన‌ని అప్పుడే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

More News

జనవరి 4న విజయవాడలో 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ - రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఖైదీనంబర్ 150' సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

చిరు సాంగ్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` శరవేగంగా సంక్రాంతి బరిలో రావడానికి సమాయత్తం అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్లస్ వన్ ఆడియో విడుదల..!

రోషన్,ఆర్తి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ప్లస్ వన్.అళహరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి... కాటమరాయుడు ఉగాదికి విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్

విశాల్ 25వ సినిమా అదేనట

`ఒక్కడొచ్చాడు` సినిమాతో ఈ డిసెంబర్ 23న ప్రేక్షకులను పలకరించిన విశాల్ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కడొచ్చాడు 22వ సినిమా అయితే 23వ సినిమా మిస్కిన్ దర్శకత్వంలో చేస్తున్నాడు.