ఎన్టీఆర్ టైటిల్....
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తర్వాత వెంటనే సినిమా చేయలేదు. చాలా కథలు విన్నప్పటికీ డైరెక్టర్ బాబీ చెప్పిన కథ నచ్చడంతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఈలోపు ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు గురించి వార్తలు అవి, ఇవి అంటూ బయటకు వస్తుండటంతో ఎన్టీఆర్, బాబీ చిత్రాన్ని యన్.టి.ఆర్ట్స్ బ్యానర్లోనే చేయబోతున్నట్టు కల్యాణ్‌రామ్ కన్ఫర్మ్ చేసేశాడు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు రోల్స్‌లో కనపడుతున్నాడని, సినిమాలో ఎన్టీఆర్ నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయబోతున్నాడని టాక్. తాజాగా సినీ ఫీల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందట అందుకని ఈ చిత్రానికి `నట విశ్వరూపం` అనే టైటిల్ పెట్టబోతున్నట్టు ఫిలింనగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుస విజయాల మీదున్న ఎన్టీఆర్, సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ తర్వాత బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందోనని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com