ఎన్టీఆర్ కొత్త సినిమాని ఈరోజే ఎనౌన్స్ చేయడానికి కారణం ఇదే..!

  • IndiaGlitz, [Friday,December 09 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న్యూమూవీని ఎనౌన్స్ చేయ‌డానికి చాలా టైమ్ తీసుకున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇజం మూవీ రిలీజ్ త‌ర్వాత ఎనౌన్స్ చేస్తారు అనుకున్నారు కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఆఖ‌రికి ఈరోజు క‌ళ్యాణ్ రామ్ ట్విట్ట‌ర్ ద్వారా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ డైరెక్ట‌ర్ బాబీతో ఉంటుంది అని ఎనౌన్స్ చేసారు. అయితే...ఈరోజే ఎనౌన్స్ చేయ‌డానికి ఓ కార‌ణం ఉంది.
అది ఏమిటంటే...ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన బ్లాక్ బ‌ష్ట‌ర్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ రిలీజై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇది ఒక కార‌ణమైతే...మ‌రో కార‌ణం ఈరోజు 9వ తేదీ. ఎన్టీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ 9. పైగా బాబీతో చేయ‌నున్న మూవీ ఎన్టీఆర్ కు 27వ సినిమా. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 9వ చిత్రం ఇది. అందుక‌నే ఈ చిత్రాన్ని 9వ తారీఖైన నేడు ఎనౌన్స్ చేసారు. అది సంగ‌తి..!