Agnipath protest: సికింద్రాబాద్ ఆందోళనతో మాకు సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్ఎస్యూఐ
Send us your feedback to audioarticles@vaarta.com
యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘అగ్నిపథ్’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది. నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఇటీవల ఆవిష్కరించారు. అయితే దీని వల్ల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోతుందని.. నాలుగేళ్ల తర్వాత తమ పరిస్ధితి ఏంటంటూ ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత మండిపడుతున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ రెండ్రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రణ రంగం:
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉదయాన్నే భారీగా స్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా పలు రైళ్లకు నిప్పు పెట్టడంతో పాటు అద్దాలు పగులగొట్టారు. వీరిని అదుపు చేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయినప్పటికీ పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఆందోళనకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలే కారణమంటూ ప్రచారం జరిగింది.
సికింద్రాబాద్ ఆందోళనతో మాకు సంబంధం లేదు : ఎన్ఎస్యూఐ
అయితే ఈ కథనాలను ఎన్ఎస్యూఐ తెలంగాణ అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘అగ్నిపత్ పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆ విద్యార్థులు ఆవేశానికి లోనయి ఈ ఘటనకు పాల్పడడం జరిగింది. ఈ సంఘటనకు ఎన్ఎస్యఐకి ఎలాంటి సంబంధం లేదు, ఆ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకే పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నా. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలను చేయవద్దని తోటి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉదయం ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ కి వెళుతుండగా నన్ను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తరువాత షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారని వెంకట్ ఆ వీడియోలో తెలిపారు.’’
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout