ఎన్నారై భర్త దాష్టీకం.. భార్యపై చెప్పులతో దాడి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఎన్నారై సంబంధాలంటేనే ఆడపిల్లల తల్లిదండ్రులను భయపడేలా చేస్తున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి జయానగర్‌లో ఎన్నారై భర్త దాష్టీకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. జయనగర్‌కు చెందిన వీరం నాగ వెంకట ప్రసాదరావుకు నాగ శిరీషతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వివాహానంతరం భార్యను వెంకట ప్రసాదరావు తన భార్యను అమెరికాకు తీసుకుని వెళ్లాడు. వీరికి ఒక పాప. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో కథ అడ్డం తిరిగింది.
భార్యను, కూతురును ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలోనే వదిలేసి నాగ వెంకట ప్రసాద రావు మాత్రం ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కాగా.. నాగ శిరీష ఇటీవలే తన కూతురుతో కలిసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. వచ్చిన వెంటనే భర్త ఇంటికి వెళ్లగా.. అతని కుటుంబం శిరీషను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో భర్త ఇంటి ముందు శిరీష తన కూతురితో కలిసి ఆందోళనకు దిగింది. తనని, తన కూతురిని ఇంటిలోకి రానివ్వటం లేదని వెంకట ప్రసాదరావు ఇంటి ముందు బైఠాయించింది. శిరీషను ఇంట్లోకి రానివ్వకపోగా.. భర్త కుటుంబీకులు ఆమెపై చెప్పులతో దాడికి పాల్పడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout