అప్పుడు ప్రేమమ్.. ఇప్పుడు ప్రేతమ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలలో ప్రేమమ్ ఒకటి. మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. గతేడాది అక్టోబర్ 7న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా.. చైతన్యకి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు ఇదే నెలలో చైతన్యకి కాబోయే శ్రీమతి సమంత నటించిన తాజా చిత్రం విడుదల కాబోతోంది. విశేషమేమిటంటే.. ఈ సినిమా కూడా మలయాళ చిత్రం ఆధారంగా తెరకెక్కడం.
రాజుగారి గది2 పేరుతో రూపొందిన సమంత కొత్త చిత్రం.. మలయాళంలో సక్సెస్ అయిన ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కింది. అక్టోబర్ 13న దీపావళి కానుకగా రానున్న ఈ సినిమాలో సమంతకి కాబోయే మావయ్య నాగార్జున కూడా ప్రధాన పాత్ర పోషించారు. చైతన్య ప్రేమమ్ రీమేక్‌కి కలిసొచ్చిన అక్టోబర్.. సమంత ప్రేతమ్ రీమేక్‌కి కూడా కలిసొస్తుందేమో చూడాలి. అన్నట్టు.. ఈ నెల 6, 7 తేదీల్లో నాగచైతన్య, సమంత.. హిందు, క్రైస్తవ పద్ధతుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments