ఇక నందమూరి ఫ్యామిలీ వంతు...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో నయా ట్రెండ్ నడుస్తుంది. అదేమిటంటే...ఆయా ఫ్యామిలీ హీరో పుట్టినరోజు వస్తే...ఆ ఫ్యామిలీ హీరోల సినిమా టీజర్స్ రిలీజ్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. ఇటీవల చిరు పుట్టినరోజు కానుకగా చిరు తనయుడు చరణ్ బ్రూస్ లీ టీజర్ రిలీజ్ చేసారు. చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్ టీజర్ అండ్ ఆడియో రిలీజ్ చేసారు.
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కంచె టీజర్ రిలీజ్ చేసారు. ఆతర్వాత అక్కినేని ఫ్మామిలీ హీరోలు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగార్జున నటిస్తున్న సొగ్గాడే చిన్ని నాయన టీజర్ రిలీజ్ చేసారు. అదే రోజు నాగచైతన్య తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో టీజర్ రిలీజ్ చేయగా, అఖిల్ తన తొలి చిత్రం టీజర్ రిలీజ్ చేసాడు. ఇద్దరు కొడుకులు హీరోలుగా ఉన్న సమయంలో తండ్రి కూడా హీరోగా ఫామ్ లో ఉండడం...ఒకే రోజు తండ్రి, ఇద్దరు కొడుకుల సినిమాల టీజర్స్ రిలీజ్ చేయడం బహుశా ఏ హీరోకు అలా జరగలేదని చెప్పవచ్చు అదో రికార్డు. ఇక అసలు విషయానికి వస్తే...
చిరు, నాగ్ ఫ్యామిలీ టీజర్స్ సందడి అయిపోయింది. ఇక ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ వంతు. వినాయక చవితి సందర్భంగా బాలయ్య డిక్టేటర్, ఎన్టీఆర్ మా నాన్నకు ప్రేమతో...చిత్రాల టీజర్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి...నందమూరి వారి కొత్త సినిమాల టీజర్స్ ఎలా ఉంటాయో చూడాలంటే వినాయక చవితి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com