ఇక నందమూరి ఫ్యామిలీ వంతు...

  • IndiaGlitz, [Thursday,September 03 2015]

టాలీవుడ్ లో న‌యా ట్రెండ్ న‌డుస్తుంది. అదేమిటంటే...ఆయా ఫ్యామిలీ హీరో పుట్టిన‌రోజు వ‌స్తే...ఆ ఫ్యామిలీ హీరోల సినిమా టీజ‌ర్స్ రిలీజ్ చేయ‌డం ఓ ట్రెండ్ గా మారింది. ఇటీవ‌ల చిరు పుట్టిన‌రోజు కానుక‌గా చిరు త‌న‌యుడు చ‌ర‌ణ్ బ్రూస్ లీ టీజ‌ర్ రిలీజ్ చేసారు. చిరు మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ టీజ‌ర్ అండ్ ఆడియో రిలీజ్ చేసారు.

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ కంచె టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఆత‌ర్వాత అక్కినేని ఫ్మామిలీ హీరోలు నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నాగార్జున న‌టిస్తున్న సొగ్గాడే చిన్ని నాయ‌న టీజ‌ర్ రిలీజ్ చేసారు. అదే రోజు నాగ‌చైత‌న్య తాజా చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా, అఖిల్ త‌న తొలి చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేసాడు. ఇద్ద‌రు కొడుకులు హీరోలుగా ఉన్న స‌మ‌యంలో తండ్రి కూడా హీరోగా ఫామ్ లో ఉండ‌డం...ఒకే రోజు తండ్రి, ఇద్ద‌రు కొడుకుల సినిమాల టీజ‌ర్స్ రిలీజ్ చేయ‌డం బ‌హుశా ఏ హీరోకు అలా జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు అదో రికార్డు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...

చిరు, నాగ్ ఫ్యామిలీ టీజ‌ర్స్ సంద‌డి అయిపోయింది. ఇక ఇప్పుడు నంద‌మూరి ఫ్యామిలీ వంతు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా బాల‌య్య డిక్టేట‌ర్, ఎన్టీఆర్ మా నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల టీజ‌ర్స్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి...నంద‌మూరి వారి కొత్త సినిమాల టీజ‌ర్స్ ఎలా ఉంటాయో చూడాలంటే వినాయ‌క చ‌వితి వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

'రెడ్ అలర్ట్' ఆడియో విడుదల

ఒకేసారి తెలుగు,తమిళం,కన్నడం,మలయాళ భాషల్లో రూపొందిన చిత్రం రెడ్ అలర్ట్.చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మహేష్ తో మురుగుదాస్ లేటెస్ట్ అప్ డేట్స్...

సూపర్ స్టార్ మహేష్...సెన్సేషనల్ డైరెక్టర్ మురుగుదాస్ వీరిద్దరుకలసి ఓ సినిమా చేయనున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

నాని వల్ల మారుతి ఫేట్ మారేనా...?

ఈరోజుల్లో...సినిమాతో చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించి సంచలనం స్రుష్టించాడు మారుతి.

ఈసారి నానితో చేస్తుంది...

‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తర్వాత యంగ్ హీరో నాని ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

బన్ని నెక్స్ ట్ మూవీ ఆ దర్శకుడితో

‘సన్నాప్ సత్యమూర్తి’ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.